21వ శతాబ్దపు అతిపెద్ద జోక్..?
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాహుల్ వ్యాఖ్యలు ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ గా చెప్పారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. దీనినే అతిపెద్ద జోక్ గా వెంకయ్య చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే 2జి, బొగ్గు, కామన్వెల్త్, హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణాలు వెలుగు చూశాయని చెప్పారు. వాటి గురించి మాట్లాడకుండా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, అవినీతి రహిత పాలన ఇస్తామనడం విడ్డూరమన్నారు.